Ma amma
జలపాతమంత విశాలమైన మనసు మా అమ్మది నవ్వితే ముత్యాలు రాలే నవ్వు మా అమ్మది ప్రేమ కురిపించే కళ్ళు మా అమ్మవి కడుపు నిండా అన్నం పెట్టె చేతులు మా అమ్మవి కొండంత ధైర్యం కలిగించే గుండె మా అమ్మది నీడలా తోడుండి నడిపించే స్ఫూర్తి మా అమ్మ ఎక్కడున్నా కరుణతో దీవించే మంచి మనసు మా అమ్మది అందరు సంతోషంగా ఉంటే చాలు అనుకొనే పిచ్చి తల్లి మా అమ్మ అందరి కోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్దం అనుకొనే బంగారు తల్లి మా అమ్మ ప్రేమకు నిలువెత్తు సాక్ష్యం మా అమ్మ ఈ లోకం లో అందరి కంటే గొప్ప తల్లి మా అమ్మ కన్నీటితో నీకు జోహార్లు అర్పిస్తూ... నీకు జీవితాంతం ఋణపడి ఉండే నీ కూతురు.... శ్రీవల్లి... English transliterated version of the poem: Jalapathamantha visalamaina manasu ma ammadi Navvithe muthyalu rale navvu ma ammadi Prema kuripinche kallu ma ammavi Kadupudu ninda annam pette chethulu ma ammavi Kondantha dhairyam kaliginche gunde ma ammadi Needala thodundi nadipinche spoorthi ma amma Ekkadunna karuna tho deevinche manchi manasu ma ammadi Andaru santhoshamga unte chaalu anukone pichi thalli ma amma...