Some more Telugu poems...
జీవితానికి మూలం...
మనసు లో ఉండే అంతరంగానికి మూలం ప్రేమ ...యువత లో కలిగే పట్టుదలకి మూలం స్పూర్తి ...
ప్రకృతి నుండి పొందే ఆనందానికి మూలం అందం ...
మనిషి లో కలిగే స్పందనకి మూలం విజయం !
కలల రాజకుమారుడు!
కలలోకొచ్చి కవ్విస్తావు
కనపడనంటూ ఏడిపిస్తావు
ఆటలాడి నవ్విస్తావు
నా గుండెలో నిదురిస్తావు
ఎవరు నీవు ?
ఎచట ఉన్నావు ?
ఎప్పుడు కనిపిస్తావు?
నీ రాకకై నా మనసు తపిస్తూ
నీ రూపాన్ని మననం చేసుకుంటూ
నీ దర్శనం కొరకు ఎదురుచూస్తూ
ఎన్నాళిలా, ఎన్నేళిలా....
Comments